పెళ్లి తర్వాత ప్రియాంకా పేరు మారుతుందా..!

రీసెంట్ గా బాలీవుడ్ క్రేజీ జంట రన్వీర్, దీపికా ఇంటివారవగా త్వరలో ప్రియాంకా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లికి సిద్ధమవుతుంది. ఆగష్టు 18న వీరి ఎంగేజ్మెంట్ జరుగగా డిసెంబర్ 2న వీరి వివాహం జరుగనుంది. నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు ఈ పెళ్లి కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తుంది. ఇక ఇప్పటికే పెళ్లి హంగమా మొదలవగా ప్రస్తుతం ప్రియాంకా నటించిన 'ద స్కై ఈజ్ పింక్' మూవీ టీంకు స్పెషల్ పార్టీ ఇచ్చింది పిసి.  

కాబోయే వరుడు నిక్ జోనాస్ తో ఈ పార్టీలో పాల్గొంది ప్రియాంకా. ఇక పెళ్లి తర్వాత ప్రియాంకా పేరు మారుతుందని తెలుస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ప్రియాంకా చోప్రా కాస్త ప్రియాంకా నిక్ జోనాస్ గా మారుతుందట. వీరి పెళ్లికి హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అవుతారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంకా సినిమాలు కొనసాగిస్తుందట. హాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ అక్కడ క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా ఆ టైంలోనే నిక్ జోనాస్ తో ప్రేమలో పడ్డది.