కళ్యాణ్ రామ్ 118

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా 118 అని పెట్టబోతున్నారట. ఈ నంబర్ చుట్టూ సినిమా కథ మొత్తం తిరుగుతుందట అందుకే దర్శక నిర్మాతలు సినిమాకు టైటిల్ గా 118 అని ఫిక్స్ చేశారట. ఆల్రెడీ సిద్ధార్థ్ హీరోగా 180 సినిమా వచ్చింది. ఆ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.    

అయితే ఈ 118 మాత్రం కచ్చితంగా ఆడియెన్స్ ను అలరించేలా ఉంటుందని అంటున్నారు. ఇన్నాళ్లు కెమెరా మన్ గా తన ప్రతిభ చాటిన గుహన్ మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా 118. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్న్, షాలిని పాండే నటిస్తున్నారు. ఇద్దరు భామలు మంచి ఫాం లో ఉండగా కళ్యాణ్ రాం తో ఈ ఇద్దరు రొమాన్స్ చేస్తున్నారు.   

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కెరియర్ అంత జోష్ ఫుల్ గా సాగట్లేదని చెప్పొచ్చు. పటాస్ తో హిట్ ట్రాక్ ఎక్కినట్టు కనిపించినా మళ్లీ రాంగ్ స్టోరీ సెలక్షన్స్ తో వెనుక పడ్డాడు. అందుకే కళ్యాణ్ రామ్ కెరియర్ మీద ఎన్.టి.ఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మరి 118 అయినా కళ్యాణ్ రామ్ కు హిట్ అందిస్తుందో లేదో చూడాలి.