
శంకర్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వస్తున్న సినిమా 2.ఓ. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు రజిని, శంకర్ లతో పాటుగా సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా అటెండ్ అయ్యారు.
సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో అసలు ఈ సినిమాకు ప్రమోషన్ అవసరం లేదని. ఎన్వి ప్రసాద్ అనవసరంగా ఖర్చు పెడుతున్నారని అన్నారు రజినికాంత్. అంతేకాదు రోబో టైంలోనే కొన్ని సీన్స్ త్రిడిలో చూశామని అద్భుతంగా ఉన్నాయనిపించడంతో ఈసారి మంచి కథతో త్రిడిలో చేదామని అనుకున్నాం. అలానే 2.ఓ త్రిడిలో చేశామని అన్నారు రజిని. మంచి కథ దొరికితే బాహుబలి లాంటి అద్భుతాలు జరుగుతాయి. అలానే ఈ సినిమాకు కథ విఎఫెక్స్, యాక్షన్ అన్ని బాగా కుదిరాయని అన్నారు.
కచ్చితంగా ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రజినికాంత్. తన మొదటి సినిమా అపూర్వరాగంగల్ సినిమా కోసం ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నానో.. 43 ఏళ్ల తర్వాత 2.ఓ చూడాలని ఎదురుచూస్తున్నా అని అన్నారు. మాటల సందర్భంలో శంకర్ కు ఇదవరకు తెలుగు రాదని కాని ఇప్పుడు నేర్చుకున్నాడని. తెలుగు వారు చాలా మంచి వాళ్లని.. తెలుగు భోజనం.. తెలుగు సంగీతం అందరు ఇష్టపడతారని. తెలుగు అమ్మాయిలు బాగుంటారని తెలుగు ప్రజల మీద తన అభిమానం పంచుకున్నారు రజినికాంత్.