
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాతో తెలుగులోనే కాదు బాలీవుడ్ లో సైతం క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకున్నాయి. అందుకే కాబోలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా కాఫి విత్ కరణ్ లో పాల్గొన్న శ్రీదేవి కూతురు జాన్వి కూడా విజయ్ దేవరకొండ ప్రస్థావన తెచ్చింది.
ఉదయాన్నే లేవగానే మగాడిగా మారితే ఎవరిలా ఉండాలని అనుకుంటున్నావ్ అంటూ అడుగగా వెంటనే జాన్వి విజయ్ దేవరకొండ పేరు చెప్పడం విశేషం. అర్జున్ రెడ్డి సినిమాలో అతని నటన నచ్చిందని అందుకే మగాడిలా మారితే అతనిలా మారాలనుకుంటున్నా అన్నది. ఆమె చెప్పిన సమాధానానికి కరణ్ జోహార్ తో పాటుగా తనతో టాక్ షోలో పాల్గొన్న తన సోదరుడు అర్జున్ కపూర్ కూడా షాక్ అయ్యాడు.
విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఉందో ఈ ఒక్క సందర్భం చూస్తే అర్ధమవుతుంది. రీసెంట్ గా టాక్సీవాలా సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న దేవరకొండ విజయ్ చిరు చెప్పినట్టుగానే స్టార్ మెటీరియల్ అనిపించుకుంటున్నాడు.