అనసూయకు బ్యాడ్ టైం స్టార్ట్

స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ఇలా రెండిటిలోనూ తన సత్తా చాటుతున్న భామ అనసూయ. బుల్లితెర యాంకర్ గా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ జబర్దస్త్ షో అంత హిట్ అవడానికి కారణం ఒకటి కమెడియన్స్ స్కిట్స్ అయితే మరోటి మాత్రం ఆమె అందాల ప్రదర్శనే. అందుకే ఆమె ఐదేళ్లుగా జబర్దస్త్ కు యాంకర్ గా కొనసాగుతుంది. అయితే కొన్నాళ్ల క్రితం అనసూయ బ్రేక్ తీసుకోగా అప్పుడు రష్మి వచ్చి అదరగొట్టింది.


జబర్దస్త్ లో రష్మికి మంచి రెస్పాన్స్ రావడంతో ఆమెతో ఎక్స్ ట్రా జబర్దస్త్ అని మరో ఎపిసోడ్ మొదలుపెట్టారు. ఇటీవల సీనిమాల్లో బిజీ అయిన అనసూయ జబర్దస్త్ షోకి మళ్లీ బ్రేక్ ఇచ్చింది. అయితే ఈసారి ఆమె బదులు వర్షిణి వచ్చింది. రెండు వారాలుగా జబర్దస్త్ యాంకర్ గా వర్షిణి ఇంప్రెస్ చేసింది. ఆడియెన్స్ కూడా అనసూయ వద్దు వర్షిణిని కంటిన్యూ చేయండని కామెంట్స్ పెడుతున్నారు.  

అనసూయని చూసి బోర్ కొట్టిందో ఏమో కాని ఆమె మీద నెగిటివిటీ వచ్చిందని తెలుస్తుంది. అంతేకాదు ఈమధ్య తరచి ఆమె నెటిజెన్లతో గొడవపడటం కూడా ఇందుకు కారణమని తెలుస్తుంది. మళ్లీ జబర్దస్త్ లో అనసూయ వస్తుందా రాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఒకవేళ అనసూయ రాకపోతే ఆమె బ్యాడ్ లక్ అన్నట్టే లెక్క.