ఎన్టీఆర్ బయోపిక్ లో ఆరెక్స్ 100 భామ

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే విద్యా బాలన్, రకుల్ నటిస్తుండగా లేటెస్ట్ గా ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో జయసుధ పాత్రలో పాయల్ కనిపిస్తుందట.

ఇప్పటికే ఆమెకు సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, జయసుధ కలిసి చాలా సినిమాల్లో నటించారు. బాలయ్య, పాయల్ ఆ ఇద్దరిగా కనిపించి అలరించనున్నారు. ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పాయల్ రాజ్ పుత్ కెరియర్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ కు ఎన్.టి.ఆర్ సినిమాలో ఛాన్స్ రావడం అమ్మడి కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పొచ్చు.