
దేవదాస్ సినిమా ఫలితం తేడా కొట్టేయడంతో నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమా క్రికెట్ నేపథ్యంతో రాబోతుంది. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని కెరియర్ లో మొదటిసారి మిడిల్ ఏజ్ పాత్రలో కనిపిస్తున్నాడట.
అక్టోబర్ 17న సెట్స్ మీదకు వెళ్లిన జెర్సీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 2019 ఏప్రిల్ 19న నాని జెర్సీ సినిమా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వార వెళ్లడిస్తూ హార్ వార్మింగ్ సమ్మర్ రాబోతుందని తన సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. రెండేళ్లుగా ఇయర్ కు 3 సినిమాలు రిలీజ్ చేసిన నాని ఈ ఇయర్ వచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు నిరాశపరచడంతో 2019 లో లక్ టెస్ట్ చేసుకోనున్నాడు.