ట్రిపుల్ ఆర్ కు లీకుల టెన్షన్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ ఈమధ్యనే రెగ్యులర్ షూట్ కు వెళ్లింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి ఓ పిక్ లీక్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ పిక్ అనగానే సోషల్ మీడియాలో ఆ పిక్ వైరల్ అయ్యింది. లీకైన పిక్చర్ ను గమనిస్తే అదేదో బ్రిటీష్ కాలం నాటి బవంతిగా కనిపిస్తుంది.

ట్రిపుల్ ఆర్ ఓ పిరియాడికల్ డ్రామా అని వచ్చిన వార్తలన్ని వాస్తవమే అన్నమాట. లీకైన పిక్ వల్ల స్టోరీ కన్ ఫర్మ్ అయ్యింది. మరి ఇందులో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఎలా కనిపిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ట్రిపుల్ ఆర్ సెట్ లీక్ పై రాజమౌళి సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఇక నుండి మరింత భారీ సెక్యురిటీతో షూటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే చిత్రయూనిట్ కు షూటింగ్ స్పాట్ లో సెల్ ను అనుమతి లేకుండా చేశాడు. జక్కన్న తన ప్రతి సినిమాకు తన యూనిట్ కు ఇలాంటి కండీషన్స్ పెట్టడం కామనే.