నానితో ఛాన్స్ మిస్.. మల్టీస్టారర్ కోసమేనా..!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్నాడు ఆ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నాని తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో నటించేందుకు కీర్తి సురేష్ ను అడుగగా ఆమె కాదన్నదని తెలుస్తుంది. నానితో ఆల్రెడీ నేను లోకల్ సినిమాలో నటించి హిట్ అందుకున్న కీర్తి ఈసారి ఎందుకు నానితో నటించనని చెప్పింది అంటే క్రేజీ మల్టీస్టారర్ లో ఛాన్స్ దక్కించుకోవడమే అని తెలుస్తుంది. 

బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ట్రిపుల్ ఆ మూవీలో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరో హీరోయిన్ గా రష్మిక మందన్న లక్కీ ఛాన్స్ దక్కించుకుందట. ట్రిపుల్ ఆర్ ఆఫర్ కోసమే నాని సినిమా మిస్ చేసుకుంది కీర్తి. మహానటితో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆర్.ఆర్.ఆర్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.