2.ఓ తెలుగులో భారీ సందడి..!

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న 2.ఓ ఈ నెల 29న రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుందట. దాదాపు తెలుగులో 1200 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.

తమిళనాడులో 750, కేరళలో 500, కర్ణాటకలో 500 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న 2.ఓ వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ చేసింది. తెలుగులో ఈ సినిమా 72 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఆంధ్రాలో 35 కోట్లు, సీడెడ్ లో 14 కోట్లు, నైజాం 23 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. బాహుబలి రికార్డుల మీద కన్నేసిన 2.ఓ ఆ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.