
మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ చేస్తేనా.. ఇదేంటి కొత్తగా ఉందనుకోవచ్చు. ఆయన నటిస్తున్న ప్రస్తుత సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాకు చిరంజీవి దర్శకత్వం బాధ్యతలు కూడా మీద వేసుకున్నాడని తెలుస్తుంది. అదేంటి ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ఏమయ్యాడు అతనితో చిరు గొడవలపై వస్తున్న వార్తలు నిజమేనా.. అతను సినిమా నుండి క్విట్ అయ్యాడా అంటే అవేవి కాలేదు కాని రీసెంట్ గా షూటింగ్ అనుకున్న టైంకు డైరక్టర్ సురేందర్ రెడ్డి కాస్త లేటుగా వచ్చాడట.
అప్పటిలోగా చిరంజీవి కొన్ని సీన్స్ డైరెక్ట్ చేశారని తెలుస్తుంది. మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. చిరు డైరక్షన్ లో వచ్చే సీన్స్ ఏవో కాని అవి కచ్చితంగా స్పెషల్ గా ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. రాం చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.