
నాగ చైతన్య, సమంత ఆఫ్టర్ మ్యారేజ్ కలిసి చేస్తున్న మొదటి సినిమా మజిలి. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రీల్ లైఫ్ లో కూడా చైతు, సమంతలు భార్యా భర్తలుగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్ లో జరుగుతుంది. సినిమాలో సమంత టికెట్ కౌంటర్ లో క్లర్క్ గా కనిపిస్తుందట.
నాగ చైతన్య, చైతు ప్రేమించి పెళ్లి చేసుకున్నా వారి మధ్య దూరం పెరుగుతుందట అది ఎలా జరుగుతుంది దాని పర్యావసానం ఏంటన్నది మజిలి కథ నేపథ్యమని తెలుస్తుంది. సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో ఫ్యాన్స్ తాకిడి ఎక్కువవడం వల్ల షూటింగ్ కు అంతరాయం కలిగిందట. అక్కడ షెడ్యూల్ త్వరగా పూర్తి చేసి త్వరలోనే మరో షెడ్యూల్ హైదరాబాద్ లో పెట్టుకోనున్నారని తెలుస్తుంది.