
యువ హీరో శర్వానంద్ హను రాఘవపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. సినిమాలో శర్వానంద్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజై ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో శర్వా, సాయి పల్లవిల జోడీ అందరిని అలరిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. స్టార్ మా శాటిలైట్ రైట్స్ కొనేయగా.. డిజిటల్ రైట్స్ ను అమేజాన్ సొంతం చేసుకుందట. ఇక హింది రైట్స్ కూడా భారీగానే పలికాయట.
ఈ మూడు కలిపి బడ్జెట్ కవర్ చేశాయని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూడు రైట్స్ 12 కోట్ల దాకా పలికాయట. శర్వానంద్ కు ఈ సినిమా రిలీజ్ కు ముందే లాభాలు తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు. లై నిరాశపరచినా హను ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి శర్వానంద్, సాయి పల్లవిల జంటతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.