
అంజలి ప్రధాన పాత్రలో హర్రర్ జానర్ లో వస్తున్న మూవీ లీసా. హర్రర్ మూవీని సరికొత్తగా 3డిలో చేస్తున్నారు. గీతాంజలి లాంటి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన అంజలి మళ్లీ అలాంటి సినిమా లీసాతో వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ. లీసా ట్రైలర్ వణికిస్తుంది.. ఇన్ స్పైరింగ్ 3డి సినిమా అంటూ ట్వీట్ చేశారు ఆర్జివి.
పీజీ మీడియా వర్క్స్ బ్యానర్ లో రాజు విశ్వనాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ట్రైలర్ చూస్తే రొటీన్ దెయ్యం కథలానే అనిపిస్తుంది. మరి సినిమా త్రిడిలో ఉంటుంది కాబట్టి స్పెషల్ గా ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో చూడాలి. అంజలి లీసా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 2డిలో అయితే ఇలాంటి సినిమాలు కోకొల్లలుగా వచ్చాయి. మరి 3డి అంటున్నారు కాబట్టి కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు.