
బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలో నిన్న సౌత్ ఇండియన్ కొంకణి సాంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది. ఈరోజు సింధి సంప్రాదాయం ప్రకారం మరోసారి పెళ్లి జరుగుతుంది. వేరు వేరు సంప్రదాయాలు, మతాలు కాబట్టి రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి చేశారు. ఇక దీప్-వీర్ పెళ్లికి చాలా తక్కువమంది అతిథులు అటెండ్ అవడం జరిగింది.
కొన్నాళ్లుగా బాలీవుడ్ లో ప్రేమపక్షలుగా ఉన్న దీపికా, రణ్ వీర్ సింగ్ కు ఫైనల్ గా పెళ్లిచేసుకున్నారు. పెళ్లికి సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా గెస్టులెవరిని సెల్ ఫోన్స్ తీసుకురావొద్దని స్ట్రిక్ట్ కండీషన్ పెట్టారు. కేవలం పెళ్లికి 300 మంది అథితులకు మాత్రమే ఇన్విటేషన్ పంపించారట. త్వరలో ముంబై పార్క్ హయత్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తారట. అక్కడకు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు అటెండ్ అవుతారని తెలుస్తుంది.