
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు రవితేజ. క్రేజ్ ఉన్నంత వరకు హీరోగా కొనసాగిస్తానని చెబుతున్న మాస్ రాజా విలన్ గా అయినా సరే చేసేందుకు తాను సిద్ధమని అంటున్నాడు.
అంతేకాదు క్యారక్టర్ ఆర్టిస్టుగా అయినా సరే చేస్తూ ఉంటాను.. ఇండస్ట్రీ తనకు లైఫ్ ఇచ్చింది కాబట్టి ఇండస్ట్రీలోనే ఉంటా. నచ్చిన కథను చేస్తూ వెళ్తా అంటున్నారు రవితేజ. రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టినా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు రవితేజకు డిజాస్టర్ రిజల్ట్ అందించాయి. అమర్ అక్నర్ ఆంటోనీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి రవితేజకు ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.