భారతీయుడు-2 ఒకరిద్దరు కాదు ముగ్గురు

శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ అదేనండి భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ సినిమా అన్నది అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 మొదలు పెట్టారు శంకర్, కమల్ హాసన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీగా వస్తుందట. ఈ సినిమాలో కమల్ తో పాటుగా ఇప్పటికే మళయాల యువ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ హీరో శింభు కూడా ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడట.  

అవినీతి వ్యతిరేకంగా వ్యక్తి చేసే పోరాటమే ఇండియన్ కథ.. అలాంటి కథతోనే మరోసారి ఇండియన్ 2 తో వస్తున్నారు శంకర్. కమల్ తో పాటుగా దుల్కర్ సల్మాన్, శిభు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక తెలుగు నుండి కూడా ఒక స్టార్ హీరోని ఈ సినిమాలో నటింపచేయాలని చూస్తున్నారట. అదే జరిగితే ఇది తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ మల్టీస్టారర్ అవనుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఇండియన్ 2 మూవీ త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.