సెన్సార్ పూర్తి చేసుకున్న 2.ఓ

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ రోబోకి సీక్వల్ గా వస్తున్న 2.ఓ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమాలో రజినికి ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించాడు. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

2.ఓ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. విజువల్ వండర్ గా రాబోతున్న 2.ఓ సినిమా సెన్సార్ వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేసిందట. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను మెచ్చుకున్నారట. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాయని చెప్పారట. 3డి విజువల్, 4డి సౌండ్ టెక్నాలజీతో ప్రేక్షకులకు 2.ఓ అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు సిద్ధమైంది. మరి సినిమా మీద ఏర్పడిన అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.