
వివాదాలు ఎలా ఉన్న సర్కార్ సినిమా సక్సెస్ లతో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఇళయదళపతి విజయ్ సర్కార్ తో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడని చెప్పాలి. మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన సర్కార్ మూవీ కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా సినిమా వచ్చిందో లేదో అలా తన తర్వాత సినిమా మొదలు పెట్టాడు విజయ్.
విజయ్ తన నెక్స్ట్ సినిమా అట్లీతో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అట్లీతో తెరి, మెర్సల్ (తెలుగులో పోలీస్, అదిరింది) సినిమాలు చేసిన విజయ్ వరుసగా మూడవసారి అతని డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. యువ దర్శకుడే అయినా అట్లీ టాలెంట్ అందరికి తెలిసిందే. విజయ్ తో అతను చేస్తున్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరి రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ మూవీలో హీరోయిన్స్ గా నయనతార, సమంత నటిస్తున్నారని తెలుస్తుంది. విజయ్, అట్లీ హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి సబ్జెక్ట్ తో వస్తుందో త్వరలో తెలుస్తుంది.