
ప్రస్తుతం వారసుల ఎంట్రీలతో హడావిడి చేస్తున్న టాలీవుడ్ లో నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వచ్చాయి. క్రిష్, బోయపాటి శ్రీనులలో ఒకరు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ చేస్తారని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తలే. కాని తాజాగా మోక్షజ్ఞ డైరెక్టర్స్ లిస్ట్ లో పూరి జగన్నాథ్ వచ్చి చేరాడు. బాలయ్యతో పైసా వసూల్ చేసే టైంలో ఓ లైన్ వినిపించాడట పూరి.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా లైన్ నచ్చగా మొత్తం కథ సిద్ధం చేసుకుని కలవమని అన్నాడట బాలకృష్ణ. ఫుల్ స్క్రిప్ట్ తో బాలయ్యను కలిసిన పూరి ఆయన్ను మెప్పించాడట. మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందో అలాంటు కథ సెట్ చేశాడట పూరి. అయితే ప్రస్తుతం పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు అక్కడే బాలకృష్ణ ఆలోచనలో పడ్డాడట.
మరోపక్క మెగాస్టార్ చిరంజీవి తనయుడు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ గా మెగ ఫ్యాన్స్ ను అలరిస్తున్న రాం చరణ్ ను ఇంట్రడ్యూస్ చేసింది పూరినే కదా ఆ సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని పూరికి ఓకే చెబుతాడని అంటున్నారు. మరి పూరితో మోక్షజ్ఞ మూవీ ఎలాంటి అంచనాలను ఏర్పరిచేలా చేస్తుందో చూడాలి.