
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కెరియర్ మొదట్లోనే శంకర్ చేసిన అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి. 1996లో వచ్చిన భారతీయుడు సినిమా తర్వాత శంకర్ ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. అప్పటికి రెండు సినిమాల అనుభవమే ఉన్నా భారతీయుడు సినిమాతో తన ప్రతిభ చాటుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు శంకర్. ఓ పక్క రజినితో చేసిన 2.ఓ రిలీజ్ కు సన్నద్ధం అవుతుండగా మరో పక్క ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఇండియన్ 2 మొదలు పెట్టాడు శంకర్. శంకర్, కమల్ కలిసి మరోసారి ఇండియన్-2 కోసం పనిచేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుండగా సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది.
సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇండియన్-2 ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మొదలుపెట్టారు. కమల్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తాడట. మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీలో ఛాన్స్ పట్టేశాడని తెలుస్తుంది.