స్పైడర్ మేన్ సృష్టికర్త 'స్టాన్ లీ' మృతి

హాలీవుడ్ కామిక్ సినిమాల్లో సూపర్ హీరోస్ గా స్పైడర్ మేన్, ఐరన్ మేన్ లాంటి ఎన్నో పాత్రలను సృష్టించిన స్టాన్ లీ తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అనంతలోకాలకు వెళ్లారు. మార్వెల్ సంస్థ నుండి స్టాన్ లీ ఎన్నో అద్భుతమైన పాత్రలను సృష్టించి ప్రపంచ సిని ప్రియులను అబ్బురపరచాడు. వాటిలో ముఖ్యంగా స్పైడర్ మేన్, ఐరన్ మేన్, ఇంక్రెడిబుల్ హల్క్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా, యాంట్ మెన్ వంటి పాత్రలు అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.   

1961 నుండి మార్వెల్ సంస్థలో పనిచేస్తున్న స్టాన్ లీ ఫస్ట్ టైం ఫెంటాస్టిక్ ఫోర్ ను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. హాలీవుడ్ సిని ప్రపంచంలో ఆయన ఓ అద్భుతం అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ పాప్ కల్చర్ అని పిలుస్తారు. 1922 డిసెంబర్ 22న జన్మించిన స్టాన్ లీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డారట. ఆయన భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన సృష్టించిన పాత్రలు మాత్రం స్టాన్ లీని ఎప్పుడు మనతోనే ఉండేలా చేస్తాయని చెప్పొచ్చు.