ట్రిపుల్ ఆర్ కథ ఇదేనా..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం గుర్తించేలా బాహుబలి లాంటి అద్భుతమైన సినిమా తీసిన దర్శకధీరుడు రాజమౌళి ఆ సినిమా చేస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడేలా చేశాడు. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఈమధ్యనే అంగరంగ వైభవంగా మొదలైంది. నవంబర్ 19నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న ఈ సినిమా కథ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ లైన్ చెక్కర్లు కొడుతుంది.

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఎనౌన్స్ చేసిననాటి నుండి రోజుకో కథ వార్తల్లో వస్తుండగా ముందునుండి చెబుతున్నట్టుగా ట్రిపుల్ ఆర్ ఓ పిరియాడికల్ మూవీగా వస్తుందట. తారక్, చరణ్ ఇద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారట. అయితే ఇది ఓ దొంగా పోలీస్ కథ అని అంటున్నారు. దొంగగా ఎన్.టి.ఆర్, పోలీస్ పాత్రలో చరణ్ కనిపిస్తారట. 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. మొత్తానికి మరోసారి బాహుబలి కాదు అంతకుమించే కథతో రాజమౌళి వస్తున్నాడని చెప్పొచ్చు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఫైనల్ కాలేదు.