
అసలే కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ వివాదం చెలరేగుతున్న ఈ సందర్భంలో ఓ సినిమా వేడుకలో స్టేజ్ మీద అందరు చూస్తుండగానే హీరోయిన్ ను ముద్దాడాడు కెమెరామెన్. ఇది ఎక్కడో జరిగింది కాదు మన టాలీవుడ్ లో జరిగిన సంఘటనే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న కవచం టీజర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతున్న కాజల్ దగ్గరకు వెళ్లిన కెమెరా మన్ చోటా కే నాయుడు ఆమెకు ముద్దుపెట్టాడు.
చోటా నాయుడు ఇలా చేస్తాడని ఊహించని కాజల్ అవాక్కయ్యింది. అయితే వెంటనే తాను ఫ్యామిలీ మెంబర్ అంటూ సమర్దించుకుంది కాజల్. అయితే చోటా కే నాయుడు చేసిన పనికి మాత్రం కాజల్ అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. తమన్ తో బెట్ కట్టి కాజల్ కు కిస్ పెట్టానని చెప్పాడు చోటా కే నాయుడు. మరి హీరోయిన్స్ విషయంలో కాస్త పద్ధతిగా ప్రవర్తిస్తే మంచిది లేదంటే ఇలాంటి పనులే రిస్క్ లో పడేసేలా చేస్తాయని చోటా కే నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నారు ప్రేక్షకులు.