
క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ ముందు ఒక పార్టులోనే ముగించాలని అనుకున్నా ఇప్పుడు రెండు పార్టులుగా ఆ సినిమా వస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా మొదటి పార్ట్ వస్తుండగా మహానాయకుడుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ వస్తుంది. మొదటి పార్ట్ ఆల్రెడీ 2019 జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేసుకోగా.. జనవరి 24న ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్ చేశారు.
అయితే అనుకున్న డేట్ కు ఎన్.టి.ఆర్ సెకండ్ పార్ట్ రావడం కష్టమని తెలుస్తుంది. జనవరి ఎండింగ్ అనుకున్న ఆ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడుతుందట. ఇక ఎన్.టి.ఆర్ సెకండ్ పార్ట్ రిలీజ్ అనుకున్న డేట్ కు కళ్యాణ్ రామ్ సినిమా వస్తుందట. కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు.