కవచం టీజర్.. బెల్లంకొండ పోలీస్ రివెంజ్ డ్రామా..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా కవచం. నవీన్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెహ్రీన్ కౌర్ కూడా సినిమాలో సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్న ఈ కవచం టీజర్ కూడా పోలీస్ దమ్ము చూపించేలా ఉంది.

అయితే కథ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అల్లుడు శీను నుండి సాక్ష్యం వరకు భారీ బడ్జెట్ సినిమాలను చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కమర్షియల్ సక్సెస్ కొట్టడంలో మాత్రం వెనుక పడ్డాడు. మరి ఈ కవచం అయినా అతని కెరియర్ కు కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.