
నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ముద్ర. తమిళ సూపర్ హిట్ సినిమా కణిథన్ కు రీమేక్ గా వస్తున్న ఈ ముద్ర సినిమాలో నిఖిల్ కు జతగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈమధ్యనే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను అలరించగా సినిమా నుండి హీరో, హీరోయిన్ కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫాం చేశారు.
డిసెంబర్ 28న నిఖిల్ ముద్ర రిలీజ్ కానుందట. సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల మీడియా జర్నలిస్ట్ అయిన హీరో ఎలా స్పందించాడు. ఏర్పడిన సమస్యలను ఎలా సాల్వ్ చేశాడన్న కథతో ఈ ముద్ర సినిమా వస్తుంది. సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి మొదటిసారి జోడీ కడుతుంది. యువ హీరోల్లో కొత్త ప్రయోగాలతో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్న నిఖిల్ ముద్రతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.