
గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన బైలింగ్వల్ మూవీ నోటా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే రాబోతున్న టాక్సీవాలాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మించారు. విజయ్ కు జోడీగా ప్రియాంకా జవల్కర్ నటించిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది.
ఆదివారం సినిమా రిలీజ్ ఈవెంట్ జరుగగా ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. కార్యక్రమంలో భాగంగా టాక్సీవాలా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఇదో హర్రర్ థ్రిల్లర్ విత్ మిక్సెడ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుందనిపిస్తుంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నోటాతో మళ్లీ ట్రాక్ తప్పిన విజయ్ టాక్సీవాలాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.