ఇండియన్-2లో మరో స్టార్ హీరో

రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 సినిమా ప్లాన్ లో ఉన్నాడు శంకర్. ఇప్పటికే కమల్, శంకర్ లు కలిసి ఈ సినిమా ఎనౌన్స్ చేయడం జరిగింది. కమల్ హాసన్ తో పాటుగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అని తెలుస్తుంది. మళయాల స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా సూపర్ ఫాంలో ఉన్నాడు.

మళయాలంలోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో కూడా దుల్కర్ సల్మాన్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు శంకర్ డైరక్షన్ లో రాబోతున్న ఇండియన్-2లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. రజినికాంత్ తో శంకర్ చేస్తున్న 2.ఓ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శంకర్ త్వరలోనే ఇండియన్-2కి సంబందించిన పనులు మొదలు పెడతాడట.