ఆర్.ఆర్.ఆర్ అన్ని ఆ ఒక్కడే

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ ఆదివారం మొదలు కానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటిస్తున్నారు. మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ పాత్రల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కథ గురించి కాని కథనం గురించి కాని హీరోలకు ఎలాంటి ఐడియా లేదట. తాను చెప్పినట్టు చేస్తే చాలు అంటూ హీరోలిద్దరిని ఒప్పించాడట రాజమౌళి.

బాహుబలి లాంటి సినిమా చేశాడు కాబట్టి రాజమౌళి మాటను వారు కాదనలేదట. ఇక ఈ సినిమాకు ఎన్.టి.ఆర్, చరణ్ రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదని తెలుస్తుంది. బిజినెస్ లో షేర్ మాట్లాడుకున్నారట. రాజమౌళి సినిమా అది కూడా బాహుబలి లాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ తర్వాత వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ట్రిపుల్ ఆర్ మరో సంచలనంగా మారుతుందని ఆశిస్తున్నారు. తన ప్రతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తపడే జక్కన్న ఈ ప్రాజెక్ట్ కు మరింత పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నాడట.