ఈసారి డిఎస్పి బుక్కయ్యాడు

స్టార్ సినిమాలకే కాదు స్మాల్ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ విషయంలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అయితే ఒక్కోసారి ఆ మ్యూజిక్ డైరక్టర్స్ చేసే పనులకు తమ ఫ్యాన్స్ నుండి కామెంట్స్ ఎదురవుతుంటాయి. ఈమధ్య తమన్ కు ఈ తాకిడి ఎక్కువైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్ మ్యూజిక్ అందించిన ఏ సినిమా అయినా అందులో ఒకటో, రెండో ట్యూన్స్ ఎక్కడి నుండో కాపీ కొట్టినవి అవుతాయి.

అయితే టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కాపీ ట్యూన్స్ కు కాస్త దూరంగా ఉంటాడు. ఈమధ్య డిఎస్పి కూడా కాపీకి అలవాటు పడ్డాడని అంటున్నారు. అతని ట్యూన్స్ లోనుండే కొన్ని కాపీ చేసి మ్యూజిక్ అందిస్తుంటాడు దేవి. లేటెస్ట్ గా రాం చరణ్ వినయ విధేయ రామ టీజర్ లో కూడా అదే జరిగింది. టీజర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లకు దగ్గర ఉంది. అందుకే డిఎస్పి బిజిఎం పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు ఇన్నాళ్లు తమన్ మీద చేసే ట్రోలింగ్స్ ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ మీద చేస్తున్నారు. మరి దేవి వీటికి ఎలా బదులిస్తాడో చూడాలి.