
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా కవచం అని ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో బెల్లంకొండ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇన్నాళ్లు స్టార్స్ తో నటించిన కాజల్ ఇప్పుడు యువ హీరోల మీద కూడా కన్నేసింది.
ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు ముందు తేజ డైరక్టర్ గా మొదలైనా ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు తేజ. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకుని కవచం చేస్తున్నాడు దర్శకుడు తేజ. అల్లుడు శీను సినిమా నుండి సాక్ష్యం వరకు తన ప్రతి సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కేలా చూసే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ కవచం కూడా అదే రేంజ్ లో ఉండేలా చూస్తున్నాడట. మరి ఈ కవచం అయినా అతనికి కమర్షియల్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.