రాం చరణ్ వివిఆర్ టీజర్.. భయపెట్టాలా.. చంపాలా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ వినయ విధేయ రామ టీజర్ అదరగొట్టేసిందంటే నమ్మాల్సిందే. చెప్పన్నా భయ పెట్టాలా చంపాలా.. భయ పెట్టాలంటే 10 నిమిషాలు.. చంపాలంటే పావుగంట అంటూ చరణ్ అదరగొట్టాడు.

ఇక చివరలో తన పేరు రామ్ కొణిదెల అంటూ బల్ల గుద్ధి మరి చెప్పడం పీక్స్ లోకి వెళ్లింది. టీజరే ఇంత సాలిడ్ గా ఉంటే ఇక సినిమా ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. టీజర్ తోనే ఈ సినిమా మాస్ ప్రియులను విందు భోజనం లాంటి సినిమా అని తెలియచెప్పారు. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీ మెగా అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. 

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో చరణ్ మరోసారి రంగస్థలం లాంటి రీ సౌండ్ వినిపించేలా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.