
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ కౌర్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ దీవాళి కానుకగా రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ హంగామా షురూ అయ్యిందని చెప్పొచ్చు.
ఈ సినిమాలో భార్యా బాధితులుగా వెంకీ, వరుణ్ తేజ్ కనిపిస్తారట. అందుకే సినిమా టైటిల్ కూడా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ట్యాగ్ తో ఎఫ్-2 అని పెట్టారు. వెంకటేష్ మార్క్ ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుందని. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అదిరిపోద్దని అంటున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల హ్యాట్రిక్ హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి ఎఫ్-2 తో డబుల్ హ్యాట్రిక్ షురూ చేస్తాడో లేదో చూడాలి. 2019 సంక్రాంతి బరిలో ఈ మల్టీస్టారర్ దిగుతుందని తెలుస్తుంది.