సర్కార్ మొదటి రోజు టార్గెట్ ఫిక్స్

విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సర్కార్ సినిమా రేపు అనగా నవంబర్ 6 (మంగళవారం)న  రిలీజ్ అవుతుంది. ఈరోజు అర్ధరాత్రి నుండే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. విజయ్ కెరియర్ లో ఎన్నడు లేని విధంగా సర్కార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3500 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సర్కార్ సినిమా 750 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.  

ఇక చెన్నైలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. చెన్నైలో మొదటిరోజు 25 కోట్ల టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. ఓవరాల్ గా మొదటి రోజే 50 కోట్లు క్రాస్ చేసి బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టాలని విజయ్ సర్కార్ ప్లాన్ చేసింది. సినిమాకు ఉన్న ఈ సూపర్ బజ్ కు కాస్త హిట్ టాక్ వస్తే వరకు ఇక రికార్డులను ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఏ.రా రహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.