
ఏంటి రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో ప్రభాస్ కూడా ఉన్నాడా.. ఎన్.టి.ఆర్, చరణ్ లతో పాటుగా ప్రభాస్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడా.. కచ్చితంగా టైటిల్ చూసి ఇలాంటి ఆలోచనలు రావడం సహజం. నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ట్రిపుల్ ఆర్ స్టార్ట్ అవనుంది. ఈ సినిమా ఓపెనింగ్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడట.
ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేలా ప్రభాస్ ఈ సినిమా లాంచింగ్ రోజు అటెండ్ అవుతాడట. రాజమౌళికి మంచి స్నేహితుడైన ప్రభాస్ తన తోటి స్టార్స్ కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని విష్ చేసేందుకు వస్తాడట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ లో హీరోయిన్స్ ఇంకా నిర్ణయించలేదు. నవంబర్ లో మొదలు పెడుతున్న ఈ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.