కార్తి దేవ్ టీజర్.. ఇంప్రెస్ చేశాడు..!

కోలీవుడ్ హీరో కార్తి, రజత్ రవిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవ్. కార్తి బైక్ రేసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అతని సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదవరకు ఈ ఇద్దరు కలిసి నటించిన ఖాకి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి దేవ్ అంటూ వచ్చేస్తున్నారు. ఒకరికోసం ఎలాగోలా బ్రతకడం కన్నా బ్రతకడానికి మరోదారి ఉంది అని చెప్పే ఓ కుర్రాడి కథ దేవ్ సినిమా కథ.

ఈ సినిమా టీజర్ లో కార్తి ఎప్పుడు లేని విధంగా కొత్త స్టైల్ తో కనిపిస్తున్నాడు. రేసర్ గా కార్తి సత్తా చాటుతాడనే అనిపిస్తుంది. టీజర్ లో కథ మొత్తం తెలుస్తున్నా ఇంకా సర్ ప్రైజ్ థింగ్స్ ఏవో ప్లాన్ చేసినట్టు ఉన్నాడు దర్శకుడు రజత్ రవిశంకర్. టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా కార్తి దేవ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.