
రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ ట్రైలర్ రిలీజ్ ఈరోజు చెన్నైలో జరిగింది. రజినితో పాటుగా 2.ఓలో విలన్ గా నటించిన అక్షయ్ కుమార్ కూడా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. సినిమా ఆలస్యం అయ్యిందని తెలుసు కాని కొన్ని సార్లు ఆలస్యం కూడా అమృతంగా ఉంటుందని అన్నారు సూపర్ స్టార్ రజినికాంత్. ఇక అభిమానుల అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని అన్నారు. అంతేకాదు దేశం గర్వించదగ్గ సినిమాల్లో ఇది ఒకటని అన్నారు.
దర్శకుడు శంకర్ గురించి చెబుతూ ఇండియన్ సినిమా ప్రైడ్ శంకర్ అని అన్నారు. ఇక ఆయనతో పాటుగా రాజమౌళి, రాజ్ కుమార్ హిరాణిలు కూడా గొప్ప దర్శకులని కితాబిచ్చారు రజిని. ఈ ముగ్గురు ఇండియన్ సినిమా జెమ్స్ అని కొనియాడారు. ప్రత్యేకంగా చిత్రయూనిట్ ను విష్ చేసిన రాజమౌళి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు రజిని. శంకర్ కూడా నా అభిమాన దర్శకులు రాజమౌళి అని చెప్పడం విశేషం.