శ్రీను వైట్ల రూటు మార్చాడు

సక్సెస్ ఫుల్ డైరక్టర్ శ్రీను వైట్ల అది ఒకప్పుడు ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదుర్కుంటున్న ఈ దర్శకుడు మాస్ మహరాజ్ రవితేజతో చేస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమా టీజర్ ఈమధ్య రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచింది. శ్రీను వైట్ల తన సినిమాలలో కామెడీ, విలన్లను బకరాలను చేయడం లాంటివి ఫాలో అవుతుంటాడు. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా టీజర్ లో అలా ఏం కనిపించలేదు.


ఇదో సీరియస్ థ్రిల్లర్ కథ అని.. కథ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడట శ్రీను వైట్ల. అందుకే టీజర్ అంత బాగా వచ్చింది. అయితే సినిమాలో తన మార్క్ కామెడీ ఉంటుందట. సునీల్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు అతనితో కామెడీ కితకితలు పెట్టిస్తాడట శ్రీను వైట్ల. సో మొత్తానికి శ్రీను వైట్ల సక్సెస్ కోసం రూటు మార్చక తప్పలేదు. నవంబర్ 16న రిలీజ్ అవనున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.