
దేవదాస్ సినిమా తర్వాత నాగార్జున ప్రస్తుతం బాలీవుడ్ బ్రహ్మస్త్రతో పాటుగా కోలీవుడ్ లో ధనుష్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. తెలుగులో సోగ్గాడు చిన్ని నాయనా సినిమా సీక్వల్ ఉంటుందని చెప్పినా ఇంకా కథ ఫైనల్ కాలేదని అంటున్నారు. ఇక చిలసౌతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ నాగ్ తో మన్మధుడు-2 చేస్తాడని వార్తలు వచ్చినా ఆ సినిమాకు సీక్వల్ గా తగిన కథ సెట్ అవలేదట.
రాహుల్ చెప్పిన రెండు కథలు నాగార్జునని మెప్పించలేదని తెలుస్తుంది. ప్రస్తుతం నాగ్ కథల వేటలో ఉన్నాడట. ఈమధ్యనే మల్టీస్టారర్ గా వచ్చిన దేవదాస్ సినిమా నిరాశ పరచడంతో స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట నాగార్జున. రాహుల్, కళ్యాణ్ కృష్ణ ఇద్దరు నాగార్జున శాటిస్ఫై అయ్యే కథలు చెప్పలేదు. మరి మిగతా ఎవరైనా సరే నాగార్జునని మెప్పించే కథతో వస్తారేమో చూడాలి.