చిరంజీవి సాయం కోరిన తేజూ

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు పడేసరికి కెరియర్ సందిగ్ధంలో పడ్డాడు. ఇదవరకు జోష్ కూడా అతనిలో కనిపించడం లేదు. ఓ పక్క యువ హీరోలు సూపర్ హిట్లతో సత్తా చాటుతుంటే మెగా కాంపౌండ్ నుండి వచ్చిన తాను మాత్రం వెనుకపడి పోయాడు. లేటెస్ట్ గా వచ్చిన తేజ్ ఐలవ్యూ కూడా రిజల్ట్ తేడా కొట్టేయడంతో ఎవరికి కనిపించకుండా అమెరికా చెక్కేసిన తేజూ తిరుగొచ్చి సినిమా మొదలుపెట్టాడు.

ప్రస్తుతం తేజూ కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. చిత్రలహరి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని నటిస్తుంది. ఈ సినిమా విషయంలో తేజూ ముందునుండి మెగాస్టార్ ఇన్వాల్వ్ మెంట్  ఉండేలా చూస్తున్నాడట. కథతో పాటుగా ఫుల్ స్క్రిప్ట్ లో చిరంజీవి సపోర్ట్ తీసుకుంటున్నాడట. కచ్చితంగా హిట్ కొట్టేలా కంటెంట్ సిద్ధం చేశాడట. సినిమాలో తేజూ ఫిల్మ్ మేకర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.