వైఎస్ పాత్ర మమ్ముట్టి తప్ప ఎవరు చేయలేరు.. ఆయన ఓ అద్భుతం : మహి వి రాఘవ్

వైఎస్ బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమాలో వైఎస్సార్ గా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారని తెలిసిందే. సినిమాలో ఆయన పార్ట్ ముగియడంతో యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ మమ్ముట్టి గురించి ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. మమ్ముట్టితో యాత్ర ముగిసింది.. 390 సినిమాలు.. 3 నేషనల్ అవార్డులు.. 60 మంది కొత్తవాళ్లను పరిచయం చేసిన హీరో.. వీటన్నిటికంటే మమ్ముట్టి ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు దర్శకుడు మహి వి రాఘవ్.


ఇంకా ఆయన నిరూపించుకోవాల్సింది ఏది లేదని.. అతిథులను గౌరవించడం మన సంప్రదాయం. ఆయన నటన నచ్చుకుంటే మీరు ఆయన్ను విమర్శించవచ్చు.. ఆ హక్కు అందరికి ఉంటుంది. యాత్ర స్క్రిప్ట్ ను తెలుగులోనే విని.. ప్రతి పదానికి అర్ధం తెలుసుకున్నారు మమ్ముట్టి. సినిమా మీద ఆయకున్న కమిట్మెంట్ అలాంటిది. నాకు ఇంతకంటే ఏం అవసరం లేదు.. గుండె మీద చెయ్యి వేసుకుని చెబుతున్నా ఈ పాత్రలో ఆయన చేసినట్టుగా మరెవరు చేయలేరని అన్నారు మహి వి రాఘవ్. యాత్రలో ఆయన నటించినందుకు ఆయనకు రుణపడి ఉంటానని మమ్ముట్టి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. డిసెంబర్ 21న రిలీజ్ అవనున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుహాసిని, వినోద్ కుమార్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, అనసూయ వంటి స్టార్స్ నటిస్తున్నారు.