
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత సినిమా కూడా లైన్ లో ఉందని తెలుస్తుంది. రంగస్థలంతో నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన దర్శకుడు సుకుమార్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందట.
సాహో చివరి దశకు రాగా రాధాకృష్ణ సినిమా ఆల్రెడీ మొదలైంది. ఇక ప్రస్తుతం సుకుమార్ మహేష్ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ సినిమా లైన్ లో ఉంటుందని తెలుస్తుంది. సుకుమార్, ప్రభాస్ సుక్కు ప్లాన్ చూస్తుంటే ఇండస్ట్రీ రికార్డులు సైతం కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.