
కొన్నాళ్లుగా సిని పరిశ్రమలో వినిపిస్తున్న మాట కాస్టింగ్ కౌచ్. శ్రీరెడ్డి మొదలు పెట్టిన ఈ వివాదం పక్కదారి పట్టగా లేటెస్ట్ గా బాలీవుడ్ మీటూ ఎఫెక్ట్ మాత్రం తీవ్రంగానే ఉంది. ఒక్కొక్కరుగా తారామణులు తమ కెరియర్ లో జరిగిన లైంగిక దాడుల గురించి బయటపెడుతున్నారు. ఇదిలాఉంటే స్టార్ తనయురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ కాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే అయితే తనది సినిమా బ్యాక్ గ్రౌండ్ కావడం చేత తనకి అలాంటివి ఎదురుకాలేదని అన్నది.
ఇక స్టార్ హీరోయిన్స్ కూడా తమ కెరియర్ లో ఎప్పుడు లెంగిక దాడి జరుగలేదని అంటారు. కాని అలా చెప్పిన వారు అబద్ధం ఆడుతున్నట్టే. ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులు ఎదుర్కుంటారు. తన కెరియర్ ఎర్లీ స్టేజ్ లో లైంగిక దాడిని ఎదుర్కున్నట్టు చెప్పారు వరలక్ష్మి. దాని గురించి ఆలోచిస్తుంటే అప్పుడు తాను కూడా లైంగిక దాడికి గురయ్యాననిపిస్తుంది అన్నారు వరలక్ష్మి.