
మెగా డాటర్ నిహారిక చేసిన రెండు సినిమాలు (ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్) నిరాశపరచినా ఆమె నటన విషయంలో మార్కులు కొట్టేసింది. కమర్షియల్ గా హిట్ కొట్టేందుకు ఆమెకి లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం నిహారిక తన మూడవ సినిమా ప్రయత్నాల్లో ఉంది. నూతన దర్శకుడు సుజన్ డైరక్షన్ లో సినిమా కన్ఫాం చేసిందట నిహారిక. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రీయ కూడా నటిస్తుందని తెలుస్తుంది.
ఏ లిటిల్ బర్డ్ షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. సినిమా టైటిల్ కూడా ఏ లిటిల్ బర్డ్ అని పెడుతున్నారని సమాచారం. సినిమాలో శ్రీయ, నిహారిక అక్కా చెల్లెల్లుగా నటిస్తారట. వారి మధ్య జరిగే మానసిక సంఘర్షణ కథాంశంగా ఈ సినిమా వస్తుందట. త్వరలోనే ఈ సినిమా మిగతా కాస్టింగ్ సెలెక్ట్ చేసి సినిమా గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. మరి ఏ లిటిల్ బర్డ్ అయినా నిహారికకు హిట్ కిక్ అందిస్తుందో లేదో చూడాలి.