నాగార్జునతో సినిమా ఉంటుంది.. కాని..!

కార్తికేయ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన చందు మొండేటి మళయాల సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ ను రీమేక్ చేసి ఇక్కడ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో చేసిన సవ్యసాచి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చందు మొండేటి ఈ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జునతో సినిమా గురించి ప్రస్థావించారు. చైతుతో సవ్యసాచి కన్నా ముందు చాణక్య కథ అనుకున్నా అని అది కుదరలేదు సవ్యసాచి చేశానని చెప్పిన చందు నాగార్జున కోసం ఓ మంచి కథ ఉందని అన్నాడు.

సవ్యసాచి సినిమా హిట్ అయితే నాగ్ సార్ కు ఈ కథ చెబుతానని అంటున్నాడు చందు. ఇక ఇదే కాకుండా కార్తికేయ-2 కోసం 15 నిమిషాల కథ ఉందని.. అయితే ఆ సినిమా చేసేందుకు తాను ఇంకా ఎదగాలని అంటున్నాడు చందు. సవ్యసాచి ఫలితాన్ని బట్టి తన తర్వాత సినిమా ఉంటుందని చెబుతున్న చందు మొండేటి సినిమా విజయం సాధించడం ఖాయమని కాన్ ఫిడెంట్ గా చెబుతున్నాడు.