సర్కార్ తో సత్తా చాటుతాడా..!

విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సర్కార్ సినిమా నవంబర్ 6న రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ లో భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇదవరకు విజయ్ సినిమాలు తెలుగులో రిలీజైనా వాటి మీద అంత కాన్సెంట్రేట్ చేయలేదు. కాని ఈ దీపావళికి తెలుగులో స్టార్ సినిమాలు లేకపోవడంతో విజయ్ ఇప్పుడు తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు.


అందుకే తెలుగు రెండు రాష్ట్రాల్లో 750 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. దాదాపు ఇక్కడ స్టార్ హీరోల సినిమాలా భారీ స్థాయిలోనే సర్కార్ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. మురుగదాస్ తో తుపాకి, కత్తి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఈ సర్కార్ తో స్టామినా చూపుతాడో లేదో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది.