అతన్ని పెళ్లాడేందుకు సిద్ధమంటున్న ఆరెక్స్ భామ

ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాలో తన అందాల ప్రదర్శనకు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 సినిమాలో కార్తికేయతో పాటు పాయల్ రొమాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో పాయల్ తెలుగులో మరో రెండు సినిమాల అవకాశాలను అందుకుంది.  

ఈమధ్య ఓ గేమ్ షోలో పాల్గొన్న అమ్మడు టాలీవుడ్ క్రేజీ స్టార్.. యువ సంచలనం విజయ్ దేవరకొండను పెళ్లాడేందుకు సిద్ధమని అన్నది. రాపిడ్ ఫైర్ రౌండ్ లో పాయల్ విజయ్ ను పెళ్లి చేసుకునేందుకు సై అనేసింది. అయితే కార్తికేయ పక్కన ఉండగా అతన్ని కాదని విజయ్ తో పెళ్లికి రెడీ అనేసరికి అందరు అవాక్కయ్యారు. మరి ఆరెక్స్ భామకు విజయ్ అంతగా నచ్చేశాడా అని అందరు అనుకుంటున్నారు.