శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కెసిఆర్ బయోపిక్

బయోపిక్ సినిమాల హవా కొనసాగుస్తున్న సిని పరిశ్రమలో ఇప్పటికే సెట్స్ మీద మూడు నాలుగు బయోపిక్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా కొత్తగా కె.సి.ఆర్ బయోపిక్ ను తీస్తున్నారని తెలుస్తుంది. 100 సినిమాలకు పైగా నటించిన శ్రీకాంత్ కె.సి.ఆర్ పాత్రలో నటిస్తున్నారట. స్వయంగా శ్రీకాంత్ ఈ విషయాన్ని వెళ్లడించారు. శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో కె.సి.ఆర్ బయోపిక్ గురించి ప్రస్థావించాడు.  


కె.సి.ఆర్ బాల్యం నుండి సిఎంగా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన ఎపిసోడ్ వరకు సినిమా ఉంటుందని అన్నారు. తెలంగాణా పోరాట నేపథ్యంలో ఎన్.శంకర్ జై బోలో తెలంగాణా సినిమా చేశాడు. ఆ సినిమాలో జగపతి బాబు నటించడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధనకు కారణమైన కె.సి.ఆర్ జీవిత చరిత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.