ట్రిపుల్ ఆర్ ఇంటర్వల్ సీన్ ఎలా ఉంటుందంటే..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ గురించి ఓ స్పెషల్ అప్డేట్ నందమూరి, మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అల్యుమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తారట. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఇంటర్వల్ ఫైట్ చేస్తారని తెలుస్తుంది. 

దాదాపు ఆ ఇంటర్వల్ సీనే 45 రోజుల దాకా చేస్తారని సమాచారం. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. మల్టీస్టారర్ కాంబినేషనే ఓ సెన్సేషన్ అయితే ఆ ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడటం అభిమానులకు తప్పకుండా పండుగ లాంటి సినిమా అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు రాజమౌళి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.